మల్లన్నసాగర్ భూసేకరణలో రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైకోర్టు కలెక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని స్పష్టం చేసింది. నవంబర్ 15న ఉదయం 10.15కు కోర్టు ముందు హజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రైతుల అభ్యంతరాలను పరిష్కరించకుండా, అభ్యంతరాలపై వ్రాత పూర్వక సమాధానం ఇవ్వకుండానే సెక్షన్ 19(1) కింద డిక్లరేషన్ జారీ చేసి అవార్డు విచారణ జరపటం… కోర్టు తీర్పుకు విరుద్దమని కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు రైతులు.