రామ్ గోపాల్ వర్మ చిత్రం విడుదలకు హైకోర్టు మరోసారి బ్రేక్ వేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చిత్రయూనిట్ కోర్ట్ కి తెలిపింది. చిత్రంలో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామన్నారు. దీనిపై స్పందించిన కోర్ట్ ఎక్కడా అభ్యంతకర సన్నివేశాలను తొలగించలేదని, కేవలం మ్యుట్ లో ఉంచారని మాత్రమే కౌంటర్ లో పేరొకున్నట్టు హైకోర్టు తెలిపింది.
మ్యూట్ లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ కూడా చేశామని చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. బోర్డు సూచనల మేరకు ఛానెల్స్ యొక్క లోగోలను కూడా తొలగించామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎగ్జామినేషన్ కమిటీ చిత్రాన్ని మత పరమైన అంశాలతో పాటు, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం అప్రూల్ చేయలేమని కౌంటర్‌లో పేర్కొంది.
రివ్యూ కమిటి ఇప్పటికే చిత్ర యూనిట్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అడిషనల్ సోలిసిటర్ జనరల్ తెలిపారు. రివ్యూ కమిటి ఇంకా చిత్రాన్ని పరీశీలించలేదని కోర్ట్ కి తెలిపారు. రివ్యూ కమిటి చిత్రాన్ని చూసి నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం రివ్యూ కమిటీ పరిదిలో ఉండటం వల్ల తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. రివ్యూ కమిటి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పై నిర్ణయం తీసుకోవాలని, అన్ని సక్రమంగా ఉన్నట్లయితే ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటి కి హైకోర్టు సూచించింది.