నయీం డైరీ సినిమా వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సినిమాలో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ ను కించపరిచారని కోర్టులో నమోదైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు సినిమాను నిలిపి వేయాలని హైకోర్టు సినిమా యూనిట్ ని ఆదేశించింది. దీనిపై చిత్ర యూనిట్ రెండు రోజుల సమయాన్ని కోరింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.