వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు బుల్లితెర పై కూడా నెంబర్ వన్ షో అనిపించుకుంది. 2017లో తెలుగులో మొదలైన ఈ రియాలిటీ షోకి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ అదిరిపోయే రేటింగ్ సంపాదించుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సీజన్-2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేయగా, 3 నుంచి 6వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తూ వచ్చాడు.
కాగా ఈ షో పై గత కొన్ని సీజన్ల నుండి వ్యతిరేకత ఎదురుకుంటుంది. బిగ్‌బాస్ ద్వారా అశ్లీలత ప్రచారం అవుతుంది అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ షోని నిలిపివేయాలి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు కొందరు సంఘకర్తలు.
గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతున్న ఈ కేసుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. ప్రజలు ఏమి చూడాలో అనేది కూడా చెప్పే పని కోర్టులది కాదు అంటూ పిటిషన్ పై ఘాటుగా స్పందించింది.
దీనికి బిగ్‌బాస్ ప్రసారం చేస్తున్న ఛానల్ వారు స్పందిస్తూ.. టీవీ ప్రసారాలుపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కోర్ట్ ని ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అంటూ కోర్ట్ కి తెలియజేశారు. అది విన్న హైకోర్టు.. ఆ వివరాలని కౌంటర్ రూపంలో కోర్ట్ ముందు సబ్మిట్ చేయాలి అంటూ విచారణని మరో ఆరు వారలు వాయిదా వేసింది.