ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మరోసారి విచారించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ డిస్మిస్ చేయగా… ఎన్నికల సంఘం ద్విసభ్య బెంచ్ ను ఆశ్రయించగా, వాదనలు కొనసాగుతున్నాయి.
వ్యాక్సిన్ ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుందని, ఇదే అంశాన్ని పంచాయితీశాఖ కార్యదర్శితో పాటు సీఎస్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినప్పటికీ ఎన్నికల సంఘం వినిపించుకోలేదని ప్రభుత్వం వాదించింది. కాస్త సమయం తీసుకున్నాక ఎన్నికల నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
అయితే, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవని… కోర్టు సూచనల మేరకే ఎన్నికలపై ముందుకు వెళ్లినట్లు ఎన్నికలం సంఘం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కరోనా వారియర్స్ అంటే ఎవరు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందికు ఎవరు వస్తారు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతుందన్న అంశాలను కోర్టు ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.