మన ఊరు-మన బడి టెండర్ల వివాదంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. హెచ్ఈసీ సంస్థ, ఫార్చ్యూన్ పెయింట్ సంస్థ అక్రమంగా టెండర్ సొంతం చేసుకుందని సువర్ణ ఇన్ఫ్రా కంపెనీ వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. పిటిషినర్ తరఫున న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్ వాదించారు.
పెయింటింగ్ టెండర్ నిబంధన ప్రకారం కాకుండా చట్టవిరుద్దంగా దక్కించుకున్నారని ప్రకాష్ రెడ్డి హైకోర్టుకు వివరించారు. ఆర్థిక సంవత్సరానికి గాను 131.50 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ పూర్తి చేసిన అనుభవం ఉండాలని.. ఏ విధమైన పర్చేసింగ్ ఆర్డర్, పేమెంట్ ప్రూఫ్ కాపీలు దాఖలు చేయకుండా కంపెనీల నుండి అక్రమంగా ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లను హెచ్ఈఎస్ కంపెనీ పొందిందని తెలిపారు.
ఈ పనిలో ఎలాంటి అనుభవం లేకుండా 10కి పైగా కంపెనీలకు పనులు పూర్తి చేసినట్టు ఫేక్ పత్రాలు సమర్పించాయని వివరించారు.
ఆ కంపెనీలు ఇవే!
ఏపీఆర్ ప్రాజెక్ట్స్, ప్రదీప్ కన్ స్ట్రక్ట్ లీ, మై హోం గ్రూప్, ఎన్సీసీ, కావేరీ హిల్ డెవెలపర్స్, భాగ్య నగర్ కన్ స్ట్రక్టింగ్, రాంకీ, జీఈఎం గ్రూప్, వసుంధర రెడ్ ఎస్టేట్స్, వెంకటేశ్వర ప్రాజెక్ట్స్
ఇలా ఈ పది కంపెనీల పనులు పూర్తి చేసినట్టు ఫేక్ ఎక్స్ పీరియన్స్ పత్రాలు సమర్పించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.