వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో కౌంటరు దాఖలు చేసేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందన్న అదనపు ఏజీ హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఈ కేసును హైకోర్టు ప్రారంభమయ్యాక భౌతిక విచారణ చేపట్టాలన్న చెన్నమనేని తరుపు న్యాయవాది వాదించారు. కానీ కేంద్రం మాత్రం వారం రోజుల్లో విచారణ చేపట్టాలని కోరింది. ఇప్పటికే కోర్టు అడిగిన అన్ని రికార్డులు సమర్పించామన్నారుఏ ఎస్ జీ. ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని కాంగ్రెస్ అభ్యర్థి, పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోరారు. జర్మనీ పౌరుడు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. వాదనలు విన్న దర్మాసనం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలకు అందరూ సిద్ధం కావాలని ఆదేశించింది.