తెలంగాణలో బస్ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తదుపరి చర్యలు చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులను పొడిగించవద్దని ప్రభుత్వ అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. కేబినెట్ నిర్ణయంపై జీవో ఇచ్చే వరకు న్యాయ సమీక్ష చేయరాదని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించగా…సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణ వెనుక దురుద్దేశాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.