ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టులో మరోసారి విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ కోసం ఆధార్ వివరాలు అడుగుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో హైకోర్టుకు ఇచ్చిన హామికి విరుద్ధంగా ఆధార్ వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించగా…. ఆధార్ వివరాలను ఏ రూపంలోనూ సేకరించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని హామీ ఇచ్చారని గుర్తు చేసిన హైకోర్టు… హామీని లిఖితపూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధరణి, రిజిస్ట్రేషన్ల అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా పరిశీలిస్తోందని ఏజీ కోర్టుకు తెలపగా… ధరణిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.