వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ… రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది.
ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీరించింది. అయితే, ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగమని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది.
తాము రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు, రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్టే ఉందని గందరగోళం నెలకొన్నందున స్పష్టత ఇస్తున్నామన్న పేర్కొంది. ధరణిపై మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలు కాగా, అనుబంధ పిటిషనర్లపై కౌంటర్ దాఖలుకు ఏజీ బీ ఎస్ ప్రసాద్ గడువు కోరారు. దీంతో ధరణి రిజిస్ట్రేషన్లపై విచారణను ఈనెల 16వరకు కోర్టు వాయిదా వేసింది.