నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకి తొలిగింది. హైకోర్టు తీర్పుతో ఓట్ల లెక్కింపు ఆగిపోవటంతో… కోర్టు విచారణలో కీలక ఆదేశాలు జారీ చేయటంతో ఫలితాల వెల్లడికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.
స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోరాదని… అయితే, మెజారిటీ కన్నా ఆ ఓట్లు ఎక్కువగా ఉంటే ఫలితాన్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. నేరేడ్‌మెట్‌లో ఇప్పటికే లెక్కించిన ఓట్లలో తెరాస అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ రాగా, ఇతర ముద్రతో 544 ఓట్లు ఉన్నాయి. దీంతో వాటిని కూడా లెక్కించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.