తీన్మార్ మల్లన్న Q-News ఛానెల్ ను ఆపేసేలా ఆదేశాలివ్వాలని దాఖలపైన పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ చట్టం ప్రకారం ఓ వ్యక్తి ప్రాథమిక హక్కును కాలరాసేలా ఆదేశాలివ్వగలం అని పిటిషనర్ ను ప్రశ్నించింది.
దేని ఆధారంగా Q-Newsను నిషేధించాలని పిటిషనర్ ను జస్టిస్ కోదండరాం దర్మాసనం ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ వాదనలు వినిపిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, మరిన్ని సాక్షాధారాలు ఆర్టీఐ నుండి రావాల్సి ఉందని, కొన్ని వారాల సమయం ఇవ్వాలని కోరారు.
అయితే, ప్రత్యేకంగా సమయం ఇచ్చేందుకు జస్టిస్ కోదండరాం నిరాకరిస్తూ, తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపడతామని కేసును వాయిదా వేశారు.