టీఆర్ఎస్ నేతల అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ, హైకోర్టులో అనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పేదల తరుపున కొట్లాడే ప్రముఖ హైకోర్టు న్యాయవాది వామన్ రావు, ఆయన భార్యను దారుణంగా హత్య చేశారు. రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై గుంజపడుగు గ్రామానికి చెందిన ఆయన పై కత్తులతో దాడి చేశారు.
తనపై దాడి చేసింది గుంజపడుగు గ్రామనికి చెందిన మంథని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అని లాయర్ వామన రావు తన చివరి మాటల్లో చెప్పారు. కత్తులతో దాడి చేస్తున్న సమయంలోఅడ్డు వచ్చిన భార్య నాగమణిపై దాడి చేయటంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
తెలంగాణలో సంచలనం రేపిన శీలం రంగయ్య లాకప్ డెత్ కేస్ పిల్ వేసిన వమాన్ రావుకు ఇప్పటికే అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. ఈయన గతంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అక్రమ ఆస్తులపై పిల్ కూడా వేశారు.