తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్ లైన్ క్లాసులపై కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది.
హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల దగ్గర కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపింది హైకోర్టు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని స్పష్టం చేసింది.
మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని తెలిపింది. అలాగే సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లోనూ రూల్స్ అమలయ్యేలా చూడాలని ఏజీని ఆదేశించింది.
నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పిన న్యాయస్థానం.. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.