ధరణి పోర్టల్ లో వ్యవసయేతర ఆస్తుల నమోదు పై హైకోర్టు విచారించింది. ఆస్తుల నమోదు పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే 29 పేజీలలో వివరాలు అడుగుతున్నారని పిటిషనర్స్ కోర్టుకు తెలుపుతూ… ఆ తర్వాతే స్లాట్ బుక్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.
స్లాట్ బుక్ చేసుకోవాలంటే 29 పేజీలు వివరాలు తీసుకోవడం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. స్లాట్ బుకింగ్ పేరుతో కొనుగోలుదారుల, అమ్మకందారుల వ్యక్తి గత వివరాలు తీసుకుంటున్నారన్న హైకోర్టు, కుటుంబ సభ్యుల, సాక్షుల, ఆధార్ కార్డ్ వివరాలు ఎందుకు ? వారి ఫోన్ నెంబర్లు ఎందుకు అని ప్రశ్నించింది. పాత పద్దతి లో రిజిస్ట్రేషన్లు చేస్తామని కోర్టు చెప్పి ప్రభుత్వం అనుకున్నదే చేస్తుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో ఆధార్ కార్డ్ ప్రస్తావన రావద్దన్న హైకోర్టు… ఆ కాలమ్ ను తీసేయాలని ఆదేశించింది. మధ్యాహ్నాం వరకు వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను 2.30గంటలకు వాయిదా వేసింది.