వ్యవసాయేతర భూములు, ఇండ్లు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ధరణి వెబ్ సైట్ పై ఉన్న స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టబద్ధం కాదని పిటిషనర్లు పేర్కొనగా, మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.
నేడు పూర్తిస్థాయి వాదనలు విన్న తర్వాత కోర్టు ధరణిపై తుది నిర్ణయం తీసుకుంది. మరోవైపు స్టే వెకెట్ అవుతుందన్న ఉద్దేశంతో బుధవారం నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.