కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది. మద్యం కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించటంలేదని కరోనా వ్యాపించే ప్రమాదం ఉందన్న పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు. విశాఖ కు చెందిన వ్యక్తి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.