పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారించింది. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో జర్నలిస్టు సంతోష్ నాయక్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
పోలీసులు ఈకేసును నామ మాత్రంగా తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పై ఎన్నో క్రిమినల్ కేసులున్నాయని, పిటిషనర్ కు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరగా కస్టడీలోకి తీసుకొని విచారణ చేయక పోతే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రాముఖ్యతను తగ్గించిన వాళ్ళం అవుతామని వాదించారు.
అయితే, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్ట్ గేషన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే మరోసారి న్యాయ స్థానాన్ని పిటిషనర్ ఆశ్రయించవచ్చని, ప్రాణహానిపై డీఎస్పీకి దరఖాస్తు చేసుకుంటే పోలీసులు రక్షణ కల్పించాలని పేర్కొంది.