ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న పురాతన హెరిటేజ్ భవనం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి పురాతన భవనాన్ని కూల్చకుండానే పక్కనే కొత్త భవనం కట్టేందుకు అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఉస్మానియా కొత్త భవనం పూర్తి సమాచారంతో పాటు ఉస్మానియా సైట్ ప్లాన్, సైట్ మ్యాప్ కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చె నెల 8కి వాయిదా వేసింది.
ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల కురిసిన వర్షానికి మురికి నీరంతా వార్డుల్లోకి చేరింది. దుర్వాసనతో వైద్యులు, పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉస్మానియాకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ రాగా, ప్రభుత్వం పాత భవనం కూల్చకుండానే కొత్తది కట్టే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోటం లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ అంశంలో కొందరు కోర్టుకు వెళ్లటంతో కొత్త భవనం నిర్మాణం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది.