తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై హైకోర్టు విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు వినకుండా వివాదం పరిష్కరించే విధానం సరికాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
వివాదం ఎలాంటిదైనా… పరిష్కరించాలంటే సహజ న్యాయసూత్రాలను అమలు చేయాలి కదా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం చట్టంలో పెట్టినట్లుగా ఇరవై రోజుల్లో వివాదం ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంలో ప్రభుత్వ వివరణ తెలుసుకొని చెబుతానన్న అడ్వకేట్ జనరల్ కోరిక మేరకు విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది. ఇందులో వ్యవసాయ భూములను ఎమ్వార్వో కార్యాలయాల్లో చేయాలని సవరణ చేస్తూ… గతంలో భూపంచాయితీల పరిష్కారానికి ఉన్న ఆర్డీవో స్థాయి కోర్టులను రద్దు చేసింది. దాని పరిధిలో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్లు తీసుకొస్తామని, ఇవి భూ సమస్యలను కేవలం 20రోజుల కాలపరిమితితో పరిష్కరిస్తాయని పేర్కొంది.