సైదాబాద్ లో 6ఏళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన రేపిస్ట్ రాజు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 8 రోజుల పోలీసుల ముమ్మర గాలింపు తర్వాత స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే పట్టాలపై రాజు శవమై తేలాడు. తను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
అయితే, రాజును పోలీసులు ముందే అరెస్ట్ చేశారని… రాజుది పోలీసుల హత్యేనంటూ ప్రజాసంఘాలు, రాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. దీనిపై అత్యవసర విచారణ జరిపిన కోర్టు… న్యాయ విచారణకు ఆదేశించింది.
విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్ లో రిపోర్టు ఇవ్వాలని మేజిస్ట్రేట్ ను ఆదేశించింది.