బయోమెట్రిక్ లో వేలి ముద్రలు రావటం లేదని, ఫేస్ రికగ్నిషన్ అవుతలేదన్న కారణంతో గిరిజనులకు రేషన్ ఇవ్వకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. గిరిజనులకు రేషన్ నిరాకరించటటంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం… బయోమెట్రిక్ తో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇంతటి లాక్ డౌన్ కష్టకాలంలో బయోమెట్రిక్ కోసం గిరిజనులకు రేషన్ నిరాకరించటం, తెల్ల రేషన్ కార్డులను ముందస్తు సమాచారం లేకుండా తొలగించటం సరైంది కాదని స్పష్టం చేసింది. గిరిజనుల్లో వయస్సు పెరిగిన కొద్ది బయోమెట్రిక్ లో తమ వేలిముద్రలు, ఫేస్ రికగ్నిషన్ పనిచేయవని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే, వలస కూలీలతో పాటు అందరికీ 12కిలోల బియ్యం ఇచ్చినట్లు ప్రభుత్వం వాదించింది. అయితే… తెల్ల రేషన్ కార్డు వారందరికీ రేషన్ ఇవ్వాల్సిందేనని, ప్రభుత్వం ప్రకటించిన 1500 ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. కార్డు దారులు ప్రభుత్వ సహాయం పొందాలని సూచించింది. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారికి 1500 ఇచ్చేందుకు నిరాకరించటం సరికాదని, కార్డు దారులందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.