తమతో పనిచేయించుకొని, జీతాలు కూడా చెల్లించలేదని ఆర్టీసీ కార్మికులు కోర్టుకెక్కటంతో… కోర్ట్ వెంటనే స్పందించింది. సెప్టెంబర్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 49,190మంది ఆర్టీసీ కార్మికులక జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని కార్మికులు ఆవేదనతో ఉన్నారు. సోమవారం వరకు జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. దీంతో… సోమవారంలోపు జీతాలు చెల్లింపు ప్రక్రియ పూర్తిచేయాలని హైకోర్ట్ ఆదేశించింది.