ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతించింది. సరూర్ నగర్ స్టేడియంలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో… కార్మికులు కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు… సరూర్‌నగర్ పబ్లిక్ మీటింగ్‌కు షరతులతో కూడిన అనుమతి ఇస్తూ తీర్పునిచ్చింది.
బుధవారం ఆర్టీసీ కార్మికులు సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.