అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. బహిరంగ సభకు తిరుపతి పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో అమరావతి జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో, రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని.. ఒమిక్రాన్ వ్యాప్తికి కూడా ఊతమిచ్చినట్టు అవుతోందని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
శాంతి భద్రతలు కాపాడల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతినిచ్చింది. డిసెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి లభించింది.