దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై దాఖలైన పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై బుధవారం విచారణ ఉన్నందున కేసు గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం వరకు నిందితుల మృతదేహాల్ని భద్రపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం నలుగురు నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయి.