హైదరాబాద్ గణనాథుల నిమజ్జనంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఇటీవలే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రబ్బర్ డ్యాం ఏర్పాటు, వ్యర్థాల తొలగింపు, ఏ విగ్రహాలను సాగర్ లో నిమజ్జనానికి అనుమతించాలో ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని, పోలీసులను ఆదేశించింది.
అయితే, నిమజ్జానానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ప్రభుత్వం… కొన్ని మినహాయింపులు ఇవ్వాలని రివ్యూ పిటిషన్ వేసింది. 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామంది. అయినా కోర్టు ఒప్పుకోలేదు. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవే అని ధర్మాసనం తెగేసి చెప్పింది.
Advertisements
నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించిన కోర్టు… జలాశయాలను కలుషితం చేసేందుకు మేం అనుమతి ఇవ్వాలా అని సూటిగా ప్రశ్నించింంది. చట్టాలను అమలు చేస్తారా లేదా ప్రభుత్వ ఇష్టమని, తాము మాత్రం తీర్పును సవరించబోమని స్పష్టం చేసింది.
కేవలం కృతిమ రంగులు లేని విగ్రహాలను మాత్రమే సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది.