మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌పై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మనిషిని ఇంతలా హింసిస్తారా అంటూ పోలీసులను సూటిగా ప్రశ్నించింది. జీవితాంతం జైలులో పెట్టాలనుకుంటున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే పోలీస్‌లను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని, అసలు రవిప్రకాశ్‌పై ఎన్ని కేసులున్నాయో మంగళవారంలోపు సమాచారం ఇవ్వండని పేర్కొంది.