హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం వెల్లడించింది.
విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు నాలుగు ప్రశ్నలు
పిటిషన్ పై విచారణ సందర్బంగా హైకోర్టు తనకు తాను నాలుగు ప్రశ్నలు సంధించుకున్నట్టు తెలిపింది. అందులో ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారమేనా?, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ను సూచించడం హక్కులను ఉల్లంఘించడమేనా?, విద్యార్థులు ‘శాంతి, సామరస్యం, శాంతిభద్రతలకు భంగం కలిగించే దుస్తులను ధరించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమసర్థమైనవి, ఏక పక్ష నిర్ణయ, ఆర్టికల్ 14, 15 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయా?, కళాశాల అధికారులపై క్రమశిక్షణా విచారణ కోసం ఏదైనా కేసు నమోదు చేయాలా?అని ప్రశ్నించుకున్నట్టు కోర్టు తెలిపింది.
Advertisements
వాటికి సమాధానాలు ఆలోచించినప్పుడు మొదటి ప్రశ్నకు ‘ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పని సరి ఆచారం కాదు. యూనిఫామ్ వేసుకోవాలనడం విద్యార్థులు అభ్యంతరం చెప్పలేని సహేతుకమైన పరిమితి. మూడవ ప్రశ్నకు.. ఉత్తర్వులు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. నాల్గవ ప్రశ్నకు … ?, కళాశాల అధికారులపై క్రమశిక్షణా విచారణ కోసం ఎలాంటి కేసూ నమోదు చేయకూడదు( ఇది ప్రిన్సిపాల్, టీచర్లు డిపార్ట్ మెంటల్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తు్నారన్న వాదనలకు సరిపోయేలా ఉంది) అని వ్యాఖ్యానించింది.
హిజాబ్ పై తీర్పు నేపథ్యంలో రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఒక వారం పాటు భారీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఉడిపితో సహా పలు జిల్లాల్లో సెక్షన్ 144ను పోలీసులు విధించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలను మార్చి 15 వరకు మూసివేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ రావు సోమవారం ఆదేశించారు.