ప్రభుత్వం ఒక్కటే రెండు వాదనలు వినిపించింది. అంశం ఒక్కటే కానీ రెండు జవాబులిచ్చింది. ఫలితంగా ప్రభుత్వ తీరుపై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ… కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది.
హైకోర్ట్‌లో ఆర్టీసీ సమ్మె, విద్యాసంస్థల సెలవులపై వేర్వేరుగా పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం జవాబు చెప్తూ… ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బయట ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. కానీ స్కూళ్ల సెలవులపై విచారణకు వచ్చేప్పటికి మాత్రం ప్రజలు, విద్యార్థులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెలవులను మరో వారం పొడిగించినట్లు తెలిపింది.
దీనిపై పిటీషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ప్రభుత్వం వేర్వేరు సమాధానాలు చేప్తోందని కోర్ట్ దృష్టికి తీసుకరాగా, కోర్ట్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ చీఫ్ జస్టిస్ దగ్గర ఉన్న నేపథ్యంలో, సెలవులపై విచారణ కూడా అక్కడే చేస్తామని స్పష్టం చేస్తూ… విచారణ రేపటికి వాయిదా వేసింది.