ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు ఆదేశాలు మేరకు ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు. శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితుల పై ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సిన సొమ్ము ను రిలీజ్ చేశామని శర్మ అఫిడివిట్ లో పేర్కొన్నారు. శర్మ అఫిడవిట్ ను పరిశీలించిన హైకోర్టు ఇవేం లెక్కలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. బస్సుల కొనుగోలు కోసం ఇచ్చిన రుణాలను కూడా రాయితీగా ఎలా పేర్కొంటారని హైకోర్టు ప్రశ్నించింది.
ఆర్టీసీ కార్మికుల 26 రోజుల సమ్మె వల్ల సంస్థకు రూ।82 కోట్ల నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.