మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. గతంలో టెస్టులు చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు పిటీషన్ దాఖలు చేశారు. టెస్ట్ లు చేయకపోతే థర్డ్ స్టేజీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. నెల్లూరు , కర్నూలు లో డాక్టర్ల చనిపోయిన తరువాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోన భయటపడిందని పిటీషనర్ పేర్కొన్నారు.
మరో వైపు డబుల్యు ఎచ్ ఓ తో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది . ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై పూర్తి స్థాయిలో హై కోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారో సమ్పర్పించాలని, ఈ నెల 26 వరకు మరో స్ఫష్టమైన నివేదిక అందివ్వాలని సర్కారు కు ఆదేశిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది హై కోర్ట్.