హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణలో కొత్త ఎండీపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది కోర్టు. ఎందుకు కొత్త ఎండీని నియమించలేదని ప్రశ్నించగా… సమర్థవంతమైన ఇంచార్జీ ఉన్నారని, కొత్త ఎండీతో సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ… ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని, ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని, రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే… ప్రభుత్వం ఎం చేస్తుందని ప్రశ్నించింది కోర్టు. ఎందుకు ప్రభుత్వం ఆందోళనలను కంట్రోల్ చేయలేకపోయిందని, గతంలో పిలిప్పిన్స్‌లో జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేసింది కోర్టు.
కార్మిక సంఘాల నాయకులతో చర్చలకు హైకోర్టే టైం ఫిక్స్ చేసింది. శనివారం ఉదయం 10.30గంటలకు యూనియన్ నేతలను చర్చలకు పిలిచి మాట్లాడాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది.