ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వాదన పట్ల హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం కోర్ట్‌కు తెలుపుతూ…కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై ఆర్టీసీ సంఘాలు 10రోజుల గడువు కోరాయి. అయితే, సమ్మెకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన బస్సులలో బస్‌పాస్‌లు నడుస్తున్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్ట్. బస్ పాస్ హోల్డర్స్‌ను అనుమతించాలని ఇప్పటికే డిపోల మేనేజర్‌లకు సమాచారం ఇచ్చామని ప్రభుత్వం చెప్పగా, పూర్తి వివరాలతో… రావాలని ఆర్టీసీ సంఘాలను ఆదేశిస్తూ… ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్ట్.