ఆర్టీసీలో 5100రూట్ల ప్రైవేటీకరణపై మంత్రిమండలి నిర్ణయం రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంటుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. మంత్రి మండలి నిర్ణయమేగా… రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటీ అని ప్రశ్నించగా, జీవో ఇచ్చాక ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఏజీ సమాధానం చెప్పారు. అయితే, సీల్డ్ కవర్‌లో కేబినెట్ నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించటంతో… ప్రభుత్వ నిర్ణయం తమకు తెలియాలి కదా, లేకపోతే ఎలా వాదిస్తామని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రతిపాదికన ఈ కేబినెట్ నిర్ణయం జరిగిందో చెప్పాలని పిటిషనర్ కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ…స్టేను కంటిన్యూ చేసింది.