ఆర్టీసీ సమ్మె, కార్మికులపై యాజమాన్యం వైఖరిని తప్పుబట్టింది హైకోర్టు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి… సమస్యను నివారించాలని సూచించింది. కనీసం యూనిఫామ్, టూల్స్, స్పేర్ పాట్స్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది.
అయితే, యాజమాన్యం మాత్రం మొత్తం 21 డిమాండ్లలో కేవలం 2 మాత్రమే ఆమోదయోగ్యమైనవని, అందులో 16డిమాండ్లు ఆర్థికపరమైనవని పేర్కొంది.
అయితే, ఈడీల కమిటీ నివేధిక తమకెందుకు సమర్పించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాజమాన్యం, కార్మికుల వైఖరితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరినా.. హైకోర్టు నిరాకరించింది. రేపు 2.30కి విచారిస్తామని స్పష్టం చేసింది.