సచివాలయం పై తొందర ఎందుకంటూ తెలంగాణ సర్కారుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయటానికి వీలులేదంటూ ఆదేశాలు జారీ చేసింది. నూతన సచివాలయం పై క్యాబినెట్ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని హైకోర్టు సూచించింది. గత విచారణలో కూల్చివేత పై ప్రభుత్వం ను సమగ్ర నివేదికను కోర్ట్ కోరింది. నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని కోర్ట్ కు ప్రభుత్వం తెలపటంతో డిజైన్ ప్లాన్ పూర్తి కానప్పుడు కూల్చివేత కు ఎందుకు తొందరని ప్రభత్వంను ప్రశ్నించింది. అవసరమైన టెక్నాలజీ ఉన్న డిజైన్ ప్లాన్ ఇంకా రెడీ కాలేదు అని చెప్పడం లో అర్ధం లేదని చీవాట్లు పెట్టింది. కూల్చివేతకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు డిజైన్ ప్లాన్ కోసం క్యాబినెట్ లో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఇప్పటి వరకు డిజైన్లు సిద్ధం కాలేదు అనడం లో అర్ధం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది.