అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. ఈ వ్యవహారంలో వారికి నోటీసులు జారీ అయ్యాయి.
చిలకలగూడ పీఎస్ లో అక్రమ నిర్బంధంపై ఈనెల 6న పిటిషన్ వేశారు మల్లన్న. తెలంగాణ పోలీసులు తనపై వరుసగా కేసులు నమోదు చేస్తుండటంపై హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు పేరుతో వేధించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోరారు.
మల్లన్న హైకోర్టులో పిటిషన్ వేయగానే ఆయన్ను వదిలేశారు. పోలీసుల తీరును తాజాగా కోర్టు ముందుంచారు అడ్వకేట్ ఉమేష్ చంద్ర. విచారణ అనంతరం రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.