ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల చెల్లింపు పిటిషన్‌ల విచారణ సమయంలో హైకోర్టు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు నిజాలను తెలివిగా దాస్తున్నారని, వాస్తవాలను మరుగున పెడుతున్నారని మండిపడింది. 4253 కోట్లు ఇస్తే బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది.
ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని చెబుతూనే… 1099కోట్లు బకాయిపడ్డామని ఏజీ అంగీకరించారు. బ్యాంకు గ్యారెంటీ కింద 850కోట్లు చెల్లించామని ఏజీ తెలిపారు.
శుక్రవారంకు వాయిదా వేయగా, శుక్రవారం విచారణకు ఆర్థికశాక కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కోర్టులో హజరుకావాలని ఆదేశించింది. సమ్మె విరమించాలని కార్మికులను ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తగినన్ని బస్సులు నడుపుతున్నామని ప్రభుత్వం చెప్తున్నా… ప్రజల ఇబ్బందులు తమకు తెలిసని ధర్మాసనం వ్యాఖ్యానించింది.