తెలంగాణ హైకోర్టు సిట్ కు మరో షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఎదురు దెబ్బ తగిలింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ మెమో ఇచ్చింది. అయితే సిట్ మోమోను ఏసీబీ కోర్టు ఇటీవల రిజెక్ట్ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్లింది.
అయితే సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టి వేసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి హైకోర్టు ఇప్పటికే బదిలీ చేసింది. దీనిపై ప్రభుత్వం తరపున ఎలాంటి అప్పీల్ చేయలేదు.
ఈ క్రమంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లను ప్రతిపాదిత నిందితులుగా పేర్కొంటూ సిట్ దాఖలు చేసిన మోమో విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్నే హైకోర్టు సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఈ కేసులో భాగంగానే బీజేపీ నేత బీఎల్ సంతోష్ సహా నలుగురికి ఊరట లభించింది. జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లపై సిట్ విచారణపై స్టే పొడిగించింది హైకోర్టు. బీఎల్ సంతోష్ సహా నలుగురికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే జనవరి 23 వరకు పొడిగించింది. సీబీఐ విచారణకు ఆదేశించినందున సిట్ విచారణపై స్టే పొడిగించడమెందుకని హైకోర్టు ప్రశ్నించింది. తీర్పు ప్రతి ప్రభుత్వం తీసుకొనే వరకు అమలు సస్పెన్షన్ లో ఉంటుంది కాబట్టి స్టే పొడిగించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు జనవరి 23వ తేదీ వరకు స్టే పొగింపు చేసింది.