కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాపై వివాదం రేగటంతో… పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కాగా, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇప్పించాల్సిందిగా డైరెక్టర్ వర్మ కూడా కోర్టును ఆశ్రయించారు.
అన్ని పిటిషన్లపై వాదనలు విన్న దర్మాసనం… కులాల మధ్య వివాదం రేపేలా సినిమా ఉందని చెప్పటంతో టైటిల్ మారుస్తూ ఇప్పటికే సెన్సార్ బోర్డుకు సమాచారం ఇచ్చామని కోర్టుకు తెలిపారు. అయితే… ఇంతవరకు తాము సినిమానే చూడలేదని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. సినిమాకు సెన్సార్ ఇచ్చే క్రమంలో తమకు 65 రోజుల పాటు సమయం ఉంటుందని సెన్సార్ బోర్డు తెలిపింది.
వర్మ తో డేటింగ్ కి శ్రీరెడ్డి సిద్ధం
వారంలోపు సెన్సార్ బోర్డు సినిమాను చూడాలని, సినిమాపై అభ్యంతరాలను అన్నీ పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. దాంతో శుక్రవారం విడుదల కావాల్సిన సినిమా విడుదల వాయిదా పడింది.