తెలంగాణ ప్రభుత్వం నుండి సినీ స్టూడియో నిర్మాణం కోసం డైరెక్టర్ ఎన్.శంకర్ కు ఇచ్చిన భూమి కేటాయింపులపై హైకోర్టు మరోసారి విచారించింది. స్టూడియో నిర్మాణ పనులు ఆపాలన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని శంకర్ తరఫు న్యాయవాది కోర్టును కోరగా… పూర్తి వాదనలు వినే వరకు స్టే ఎత్తివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 6కుక వాయిదా వేసింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినందున… డైరెక్టర్ ఎన్. శంకర్ కు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించింది. సిటీకి ఆనుకోని ఉన్న శంకర్ పల్లి దగ్గరలోని మోకిల్లాలో ఎంతో విలువైన 5ఎకరాల భూమిని ఎకరం 5లక్షల చొప్పున 25లక్షలకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ భూమిని కారుచౌకగా ఇవ్వటంపై హైకోర్టులో పిల్ దాఖలు కాగా… అక్కడ నిర్మాణాలపై కోర్టు స్టే విధించింది.