వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను కొనసాగించాలని తీర్పునిచ్చింది. ఈనెల 8వరకు ధరణిపై ఉన్న స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ధరణి పోర్టల్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.
ఆస్తుల వివరాలన్ని చెప్పాలనటం సరైంది కాదని, ఇది స్వేచ్ఛను హరించటమేనని ధరణి కోసం ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల ఆన్ లైన్ పై కొందరు కోర్టును ఆశ్రయించగా… కోర్టు స్టే విధించింది.