అమరావతి రాజధాని భూముల్లో అసైన్డ్ భూముల అంశంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చింది. అయితే, వీటిపై చంద్రబాబుతో పాటు నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
తమపై దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని… సీఆర్డీయే చట్టమే రద్దు చేశాక ఇక జీవో నెం 41కి చట్టబద్దత ఎక్కడిదని చంద్రబాబు తరుపు లాయర్లు వాదించారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా, హైకోర్టు లాయర్ దమ్మలపాటి చంద్రబాబు తరుపున వాదించారు.
కేసు నమోదు చేసినప్పుడు ఏమైనా ఆధారాలు సేకరించారా, మీ వద్ద ఆధారాలున్నాయా అని సీఐడీని హైకోర్టు ప్రశ్నించగా… విచారణ సందర్భంలో వివరాలు వెల్లడించలేమని సీఐడీ కోర్టుకు తెలిపింది. విచారణకు అనుమతిస్తే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని వాదించింది. మొత్తం వాదనలు విన్న హైకోర్టు… ఈ వ్యవహరంలో చంద్రబాబుపై విచారణను స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.