కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు భూసేకరణపై స్టే విధించింది న్యాయస్థానం. క్రాస్ డ్రైనేజీ పనుల కోసం సెప్టెంబరు 27న ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి ప్రజలు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.