దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాక… చివరి క్షణంలో హైకోర్టు అంత్యక్రియలపై స్టే విధించింది. మృతదేహాలను భద్రపర్చాలంటూ ఆదేశాలిచ్చింది. దాంతో ఆరు రోజులుగా మృతదేహాలను భద్రపర్చారు పోలీసులు.
అయితే, మృతదేహాల విషయంలో… హైకోర్టు గురువారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ హైకోర్టు విచారణ సమయానికే ఈ కేసులో సుప్రీం త్రిసభ్య కమీషన్ వేయటంతో హైకోర్టు కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సుప్రీంలో విచారణ కొనసాగుతున్నందున ఇక తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో… ఇప్పుడు మృతదేహాల పరిస్థితి ఏంటని అడిగినా హైకోర్టు కూడా సుప్రీంకే వదిలేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టునే అడగండి లేదా విచారణ కమీషన్‌నే అడగాలని సూచించింది.
ఇప్పటికే ఆరు రోజులుగా మృతదేహాలను భద్రపర్చారు. దీంతో అవి కుళ్లిపోయే దశకు చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే బంధువులు కూడా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వండి, చనిపోయాక కూడా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. నిందితుల బంధువులు ఇప్పటికే గోతులు తీసి… అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.