పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యపై హైకోర్టు స్పందించింది. ఈ ఉదంతాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని సీజే ధర్మాసనం ప్రకటించింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలన్న హైకోర్టు సూచించింది.
లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యనించింది. సాక్షాలను పకడ్బంధీగా సేకరించాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.