విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది.
సీబీఐ సమర్పించిన ఆ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని పేర్కొంది. మార్చి 31లోగా నివేదిక అందించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశిస్తూ… తదుపరి కేసు విచారణ ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది.