మంత్రి కేటీఆర్ జన్వాడలో అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారని, 111జీవోను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఆ కేసులో ఎన్జీటీ విచారణ కమిటీని ఏర్పాటు చేయగా… కేటీఆర్ హైకోర్టులో సవాలు చేయటంతో ఎన్జీటీ ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా… ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి తరుపు లాయర్ వాదనలు వినిపించారు. కేసు విచారణ దశలో ఉన్నందున స్టే పై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, పూర్తి వాదనలు విన్న తర్వాత స్టే ఎత్తివేయాలో లేదో నిర్ణయిస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కామెంట్ చేసింది. జనవరి 6న మరోసారి పూర్తి వాదనలు వింటామని, ఆ తర్వాతే స్టే పై తుది నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు.