గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల ముందు అర్ధరాత్రి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల గుర్తు మాత్రమే కాదు గుర్తులపై ఎలాంటి పెన్ మార్క్ ఉన్నా ఓటు సరైందిగానే గుర్తించాలని ఆ ఉత్తర్వుల సారాంశం. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించటం, కోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించటం చకాచకా జరిగిపోయాయి.
అయితే, ఎన్నికల సంఘం విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది. దీనిపై విచారిస్తూ… గెలుపోటములను నిర్ధేశించే స్థాయిలో టిక్ మార్క్ ఓట్లున్న చోట ఫలితం నిలిపివేయాలని… మిగతా చోట అలాంటి గుర్తుతో ఉన్న ఓట్లను లెక్కలోకి తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ కేసు వాయిదా వేసింది. దీంతో నెరడ్ మెట్ లో ఎన్నికల ఫలితం నిలిపేశారు.
సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత వచ్చే తీర్పును బట్టి నేరెడ్ మెట్ ఫలితం ప్రకటించనున్నారు.